వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌..! మీరు చూశారా..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ సంస్థ వాట్సాప్  వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. యూజర్స్ మైండ్ సెట్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటుంది. అందుకే ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్ స్థాయి వేరు, స్థానం వేరు. వాట్పాప్ అంటేనే గ్రూప్స్. ప్రెండ్స్, కొలిగ్స్, ఫ్యామిలీస్..అందరూ గ్రూప్స్‌ను క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు తమ విశేషాలను పంచుకుంటూ ఉంటారు. వాట్సాప్ తాజాగా తీసుకువచ్చిన ఫీచర్ ఏంటంటే… గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ ఒక నిర్ణీత సమయం […]

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌..! మీరు చూశారా..?
Follow us

|

Updated on: Nov 30, 2019 | 12:10 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ సంస్థ వాట్సాప్  వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. యూజర్స్ మైండ్ సెట్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటుంది. అందుకే ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్ స్థాయి వేరు, స్థానం వేరు. వాట్పాప్ అంటేనే గ్రూప్స్. ప్రెండ్స్, కొలిగ్స్, ఫ్యామిలీస్..అందరూ గ్రూప్స్‌ను క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు తమ విశేషాలను పంచుకుంటూ ఉంటారు. వాట్సాప్ తాజాగా తీసుకువచ్చిన ఫీచర్ ఏంటంటే… గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ ఒక నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది.

ఉదాహరణకు ఒక గంట వరకు మనం టైమ్ లిమిట్ పెట్టామనుకోండి…వన్ అవర్ అయిపోయిన వెంటనే ఆ మెసేజ్ ఇక ఎవరికీ కనిపించదు. ఇలా ఒక గంట నుంచి ఒక సంవత్సరం వరకు ఎప్పటివరకైనా టైం పరిధిని మనం సెట్ చేసుకోవచ్చు. డిసప్పియరింగ్ మెసేజెస్ పేరుతో ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్‌లో వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో వచ్చింది. ఇక త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు, మరికొంతకాలంలో వినియోగదారులందరికి  అందించడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా మనం ఒక మెసేజ్ చేసి ఆల్ డిలీట్ చేస్తే..ఆ మెసేజ్ అదృశ్యం అవుతుంది కానీ డిలీట్ చేసినట్టు అందరికీ అర్థమవుతుంది. కానీ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌లో అలా ఏమీ కనిపించదు. ఇక త్వరలోనే డార్క్ మోడ్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో