వాట్సాప్‌లో అదిరిపోయే ఐదు కొత్త ఫీచర్లు

యూజర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఐదు కొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్. ఈ మేరకు బుధవారం ప్రకటనను విడుదల చేసిన ‌వాట్సాప్ సంస్థ

వాట్సాప్‌లో అదిరిపోయే ఐదు కొత్త ఫీచర్లు
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 3:03 PM

యూజర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఐదు కొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్. ఈ మేరకు బుధవారం ప్రకటనను విడుదల చేసిన ‌వాట్సాప్ సంస్థ అతి త్వరలో.. యూజర్లకు యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్, వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ వీడియో కాల్స్​, స్టేటస్​ లాంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.

యానిమేటెడ్​ స్టిక్కర్స్​: ఇందులో ఫన్నీ యానిమేటెడ్‌ స్టిక్కర్లు ఉండనున్నాయి. దీని ద్వారా చాటింగ్​ మరింత ఫన్​గా అవ్వనుంది.

క్యూఆర్​ కోడ్: దీని ద్వారా క్యూఆర్‌ కోడ్‌తో వ్యక్తి నంబర్‌ను స్కాన్‌ చేసి, మన కాంటాక్ట్‌లోకి యాడ్‌ చేసుకోవచ్చు.

వెబ్​కు డార్క్​మోడ్​: ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లలో చాలా కాలం క్రితమే వాట్సాప్​ డార్క్ మోడ్​ను తీసుకొచ్చింది. అయితే ఇకపై వెబ్​ వెర్షన్​కు కూడా డార్క్‌ మోడ్‌ని పెట్టుకునే అవకాశం ఉంటుంది.

వీడియో క్వాలిటీ: ఇప్పటికే గ్రూప్‌ వీడియో కాల్‌లో పాల్గొనే వారి సంఖ్యను ఎనిమిదికి పెంచిన వాట్సాప్‌.. కాల్‌ క్వాలిటీపై కూడా దృష్టి పెట్టింది. ఇక కాల్​లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే వాళ్లు ఫోకస్ అయ్యేలా మార్పులు చేర్పులు చేయబోతోంది.

స్టేటస్​: స్టేటస్ దానంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్​లలో ఉండగా.. ఇకపై కైఓఎస్​కు వాట్సాప్​ విస్తరించనుంది.