విజ‌య్ మాల్యాపై వెబ్ సిరీస్‌.. ద‌క్షిణాది న‌టుడు నటించ‌బోతున్నారా?

ఇప్పుడు విజ‌య మాల్యా పాత్ర‌లో న‌టించేందుకు ఓ ప్ర‌ముఖ న‌టుడిని ఎంపిక‌ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. ద‌క్షిణాది న‌టుడిని ఈ పాత్ర‌లో కోసం సంప్ర‌దిస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. అందుకు ఆ న‌టుడు కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఏది ఏమైనా త్వ‌రలోనే దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు..

విజ‌య్ మాల్యాపై వెబ్ సిరీస్‌.. ద‌క్షిణాది న‌టుడు నటించ‌బోతున్నారా?
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 5:30 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్క‌ర్ కింగ్ విజయ మాల్యా లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ వెబ్​సిరీస్ తెర‌కెక్క‌బోతుంది. ​ ఇందుకు సంబంధించిన క‌థ కోసం నిర్మాణ సంస్థ‌ అల్మైటీ మోషన్​ పిక్చర్స్​ ‘ది విజయ మాల్యా స్టోరీ’ పుస్తక రచయిత​ నుంచి హక్కులను కొనుగోలుచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలిపారు నటి, నిర్మాత ప్రబ్లీన్​ కౌర్​. ది విజయమాల్యా స్టోరీ’ బుక్‌ని ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ కే గిరిప్రకాశ్​ రాయగా.. పెంగ్విన్​ ఇండియా ప్రచురించింది. విజయమాల్యా పుట్టిన దగ్గర నుంచి అతడు యూకే పారిపోయినంత‌వ‌ర‌కు సంబంధించిన వివరాలు ఆ పుస్త‌కంలో ఉన్నాయి​. దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ ఫైన‌ల్ స్టేజీలో ఉంది.

ఇప్పుడు విజ‌య మాల్యా పాత్ర‌లో న‌టించేందుకు ఓ ప్ర‌ముఖ న‌టుడిని ఎంపిక‌ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. ద‌క్షిణాది న‌టుడిని ఈ పాత్ర‌లో కోసం సంప్ర‌దిస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. అందుకు ఆ న‌టుడు కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఏది ఏమైనా త్వ‌రలోనే దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతుంది అల్​మైటీ సంస్థ. ఇక మ‌రికొద్ది రోజుల్లోనే షూటింగ్​ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది మూవీ యూనిట్. ఈ వెబ్​సిరీస్​ను ఎమ్​ఎక్స్​ ప్లేయర్​లో రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది అల్​మైటీ మోషన్​ పిక్చర్స్ నిర్మాణ సంస్థ.

Read More:

సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా

నాతో పాటు నా కూతురికి కూడా క‌రోనా సోకిందిః మాళ‌విక‌

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి.. ప్ర‌ధాని మోదీ నివాళి