శబరిమల అంశం ఏమాత్రం ప్రభావం చూపలేదు… గెలుపు మాదేనన్న పినరయ్

Kerala CM Pinarayi Vijayan On Exit polls, శబరిమల అంశం ఏమాత్రం ప్రభావం చూపలేదు… గెలుపు మాదేనన్న పినరయ్

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను కేర‌ళ సీఎం పినరయ్ విజ‌య‌న్ కొట్టిపారేశారు. అంచ‌నాల ఆధారంగా ఇచ్చే ఎగ్జిట్ పోల్స్‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కేర‌ళ‌లో వామపక్ష పార్టీ డీలాపడిందని… కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎక్కువ సీట్ల‌ను ఖాతాలో వేసుకోనున్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాగా, కేర‌ళ ఎన్నిక‌ల్లో శ‌బ‌రిమ‌ల అంశం ఎటువంటి ప్ర‌భావం చూప‌లేద‌ని… ఆ స‌మ‌స్య‌ను ఎవ‌రు క్రియేట్ చేశార‌న్న విష‌యం అంద‌రికీ తెలుస‌ని పినరయ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *