బిగ్ బ్రేకింగ్: సైకో ప్రవీణ్‌కు ఉరిశిక్ష ఖరారు

Warangal Court imposes death to Praveen

వరంగల్ జిల్లా హన్మకొండలో సంచలనం రేపిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత హత్యాచారం కేసులో హంతకుడు ప్రవీణ్‌కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ వరంగల్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ముద్దాయి ప్రవీణ్, జడ్జి జయకుమార్ ఎదుట నేరం అంగీకరించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇక ఈ కేసులో 30కి పైగా సాక్షులను విచారించిన కోర్టు.. 48రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. మరోవైపు అతడికి సహాయం చేసేందుకు న్యాయవాదులు కూడా నిరాకరించారు. కాగా ఈ ఏడాది జూన్ 18న తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై ప్రవీణ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ పలు సంఘాలు తమ డిమాండ్‌ను వ్యక్తపరిచాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *