ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఎన్నికలు… ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్

మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో ..25 కశ్మీర్​లో ఉండగా..18 జమ్ములో ఉన్నాయి.

  • Sanjay Kasula
  • Publish Date - 9:48 am, Sat, 28 November 20

ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సమరంలో భాగంగా ఫస్ట్‌ఫేజ్‌ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. 43 డీడీసీలు, సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో ..25 కశ్మీర్​లో ఉండగా..18 జమ్ములో ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ..ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.

డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.