రాములమ్మపై కుట్ర.. కారణం ఆ ఇద్దరేనా.?

Vijayashanti not joining BJP, రాములమ్మపై కుట్ర.. కారణం ఆ ఇద్దరేనా.?

రాములమ్మ పార్టీ మారబోతున్నారా? బీజేపీ వైపు చూస్తున్నారా..?త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారా.. లేదంటే ఇలా రూమర్లను క్రియేట్ చేశారా? గాంధీభవన్ వేదికగా రాములమ్మపై కుట్ర చేస్తున్నారా? రాములమ్మపై అసత్య ప్రచారాలు చేస్తే ఆ నేతలకొచ్చే లాభమేంటి? దీనిపై విజయశాంతి ఏమంటున్నారు?

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. బీజేపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన విజయశాంతికి ఆ పార్టీ నేతలతో పరిచయాలున్నాయి.తెలంగాణ బలపడాలని కలలుగంటున్న ఆ పార్టీ కాంగ్రెస్ కీలక నేతలకు వలలు వేస్తుందని ప్రచారం నడుస్తోంది.ఇందులో భాగంగా రాములమ్మ బీజేపీలోకి రీఎంట్రీ ఇస్తారని ఓ వార్త వైరల్ అయింది. ఈ ప్రచారంపై స్పందించిన విజయశాంతి పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తాను పార్టీ మారబోతున్నానంటూ కొందరు కావాలనే కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయం గాంధీభవన్ నుంచే కుట్ర చేస్తున్నారని కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంపై టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు ఆమె ఆ ప్రకటనలో తెలిపారు. పార్టీ మార్పుపై హడావుడిగా నిర్ణయం తీసుకోబోనంటూ స్పష్టం చేశారు. అలాగే పార్టీ మారే ఆలోచన ఉంటే బహిరంగంగానే ప్రకటిస్తానని చెప్పారు. తను పార్టీ మారబోతున్నాననే ప్రచారం వెనుక ఇద్దరు నేతలు ఉన్నారని విజయశాంతి తన సన్నిహితులతో వాపోయారు. అయితే గాంధీ భవన్ కుట్రను త్వరలోనే బయట పెడతానంటూ విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *