తాత ఆపరేషన్ డబ్బులతో ఆన్‌లైన్ గేమ్ ఆడి.. చివరికి ??
కోనసీమ జిల్లాలో ఆన్‌లైన్ గేమ్‌కి యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్ గేమ్ ఆడి సాధ్విక్ అనే యువకుడు రూ.78 వేలు పోగొట్టుకున్నాడు. తన తాత ఆపరేషన్ కోసం దుబాయ్ నుంచి సాధ్విక్ మేనత్త డబ్బులు పంపింది. మేనత్త పంపిన డబ్బులతో సాధ్విక్ ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. ఆమె పంపిన డబ్బులు మొత్తం పోయాయి.
కోనసీమ జిల్లాలో ఆన్‌లైన్ గేమ్‌కి యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్ గేమ్ ఆడి సాధ్విక్ అనే యువకుడు రూ.78 వేలు పోగొట్టుకున్నాడు. తన తాత ఆపరేషన్ కోసం దుబాయ్ నుంచి సాధ్విక్ మేనత్త డబ్బులు పంపింది. మేనత్త పంపిన డబ్బులతో సాధ్విక్ ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. ఆమె పంపిన డబ్బులు మొత్తం పోయాయి. దీంతో ఇంట్లో తెలిస్తే మందలిస్తారని సాధ్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాధ్విక్ సూసైడ్‌తో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కేవలం సాధ్విక్ ఒక్కడే కాదు.. వందలాది మంది యువకులు ఈ ఆన్ లైన్ గేమ్స్ కారణంగా తనువు చాలిస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడిపోయే దశ నుంచి.. ఆ ఆటలకు బానిసలుగా మారే పరిస్థితి వస్తోంది. ప్రపంచానికంతా కీడు తలపెట్టిన కరోనా.. ఆన్‌లైన్ గేమ్‌లకు మాత్రం మంచే చేసింది. మహమ్మారి, లాక్‌డౌన్ వల్ల.. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యం కావడంతో.. స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంటర్నెట్ డేటా ప్లాన్‌లు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలే ‘ఆన్‌లైన్ గేమింగ్ బూమ్’ను సృష్టించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోట్ల విలువైన కారులో చాయ్ దుకాణమా !! కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికి నయా టెక్నిక్
ఎండలకు తట్టుకోలేక సెలైన్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు !!
అమ్మప్రేమకు లేదుసాటి.. మనిషైనా.. జంతువైనా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
గుండెపోటు.. ఆరోజే ఎందుకు వస్తోంది ?? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ??