Yadadri: యాదాద్రిలో గుప్త నిధుల కలకలం

Updated on: Jan 12, 2026 | 5:21 PM

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఆనాటి రాజులు కోటగోడల కింద గుప్తనిధులు దాచి ఉంటారనే నమ్మకంతో కొందరు ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో కొంత వ్యవసాయ భూమిని హైదరాబాద్ కు చెందిన ఒకరు కొనుగోలు చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఆనాటి రాజులు కోటగోడల కింద గుప్తనిధులు దాచి ఉంటారనే నమ్మకంతో కొందరు ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో కొంత వ్యవసాయ భూమిని హైదరాబాద్ కు చెందిన ఒకరు కొనుగోలు చేశారు. వ్యవసాయ భూమికి సూపర్ వైజర్ గా ఈసీఐఎల్ చెందిన పులి కుమార స్వామిని నియమించారు. వ్యవసాయ భూమిలో చిన్నపాటి గుట్ట ఉంది. ఆ గుట్టపై ఆంజనేయుడి విగ్రహం కూడా ఉంది. సూపర్ వైజర్ గా పని చేస్తున్న కుమారస్వామికి నెలసరి వేతనం సరిపోవడం లేదు. ఈజీ మనీ కోసం ఓ పథకం వేశాడు. విజయవాడ కు చెందిన రామినేని కృష్ణా కిషోర్, పాబోలు శ్రీనివాస్, ఆకుల నరసింహ రావు, ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్, బొమ్మల రామారంకు చెందిన వేణుతో కలిసి కుమారస్వామి ముఠాగా ఏర్పడ్డారు. ఆంజనేయుడి విగ్రహం కింద గుర్తు చప్పుడు కాకుండా గుప్తనిధుల కోసం ఈ ముఠా తవ్వకాలను చేపట్టింది. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవసాయ భావి కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు స్వామి తెలిపాడు. ప్రత్యేక పూజలు చేసి పొక్లెయినర్‌తో ఈ ముఠా తవ్వకాలను చేపట్టింది. అయితే గ్రామస్తులకు తవ్వకాలపై అనుమానాలు కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. తవ్వకాలకు వినియోగించిన హిటాచీ పొక్లెయినర్‌, కారు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో గుప్త నిధుల తవ్వకాలను చేపట్టడం నేరమని పోలీసులు అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??

రిపబ్లిక్‌ డే పరేడ్‌.. పక్షుల కోసం ఇలా

ఇంటి నుంచే సైబర్‌ క్రైమ్‌ ఎఫ్‌ఐఆర్‌.. బాధితులకు అండగా ‘సీ-మిత్ర’ హెల్ప్‌ డెస్క్‌

లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు

రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్