పొంచి ఉన్న మరో మహమ్మారి.. ప్రపంచానికి ముప్పు తప్పదా?

Edited By:

Updated on: Apr 10, 2025 | 5:21 PM

2020లో వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక అనిశ్చితి నెలకొంది. ఇప్పడిప్పుడే కరోనా ఎఫెక్ట్‌నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో మరో మహమ్మారి మానవాళిపై పంజా విసిరేందుకు రెడీగా ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు.

ఇది అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. అది ఎప్పుడు ఏ రూపంలో మానవాళిపై విరుచుకుపడుతుందో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ పాండెమిక్ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసనాలను గుర్తు చేశారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని, అది ఎప్పుడైనా సంభవించవచ్చని హెచ్చరించారు. అందుకు ఇరవై ఏళ్లు పట్టవచ్చు లేదా రేపే సంభవించవచ్చని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా సృష్టించిన విలయాన్ని మనమందరం చూశామని, ఈ మహమ్మారి కారణంగా అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని చెప్పినప్పటికీ, ఆ సంఖ్య 2 కోట్లు దాటి ఉంటుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం 

గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

అయ్యో.. ఈ కండక్టర్‌ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో