Viral Videos: తాలిబన్ల ఆధీనంలో ఆఫ్గనిస్థాన్.. కాబుల్ విమానాశ్రయంలో హృదయ విదారక దృశ్యాలు..

Kabul Airport: ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో భారీ సంఖ్యలో జనం ప్రాణభయంతో ఆ దేశం నుంచి పారిపోతున్నారు. భారీ సంఖ్యలో విదేశీయులు, సొంత దేశానికి చెందినవారు విమానం కోసం కాబుల్ విమానాశ్రయం చేరుకున్నారు.

Viral Videos: తాలిబన్ల ఆధీనంలో ఆఫ్గనిస్థాన్.. కాబుల్ విమానాశ్రయంలో హృదయ విదారక దృశ్యాలు..
Kabul Plane1

Edited By:

Updated on: Aug 16, 2021 | 12:48 PM

ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో భారీ సంఖ్యలో జనం ప్రాణభయంతో ఆ దేశం నుంచి పారిపోతున్నారు. భారీ సంఖ్యలో విదేశీయులు, సొంత దేశానికి చెందినవారు విదేశీ విమానం కోసం కాబుల్ విమానాశ్రయం చేరుకున్నారు. దీంతో విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రంతా విమానాల కోసం పడిగాపులు కాచారు. అక్కడ ఏ విమానం కనిపించినా అందులో ఎక్కి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్ ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధం..తమకు విమానంలో టిక్కెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు.  దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. వందలాది మంది విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

అటు తాలిబన్ల అరాచక పాలన మొదలైన వేళ..ఆఫ్గనిస్థాన్‌ జైళ్ల నుంచి ఖైదీలు బయటకు వస్తున్న దృశ్యాలు అక్కడ నెలకొన్న దుస్థితికి అద్దంపడుతోంది. ఇక దేశంలో తమకు రక్షణ లేదని ఆ దేశ మహిళలు వాపోతున్నారు.

కాబుల్ విమానాశ్రయంలో దృశ్యాలు..

కాబుల్‌లోని జైళ్ల నుంచి విడుదలైన ఖైదీలు..

Also Read..

అడవి దున్నపై హైనాల గుంపు ఎటాక్.. చివరికి ఏం జరిగిందంటే.. వీడియో చూస్తే షాకవుతారు!

Viral Video: పంత్, ఇషాంత్‌లపై కోప్పడ్డ విరాట్ కోహ్లీ, రోహిత్‌.. ఎందుకో తెలుసా?