Trump Govt: అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!

|

Nov 20, 2024 | 5:52 PM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన కార్యవర్గంలో భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి కీలక బాధ్యతలు బాధ్యతలు అప్పగిస్తారన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అగ్రరాజ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.

ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్‌ ఎస్టేట్‌ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్‌ రామస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన .. లక్షలమంది ఫెడరల్ బ్యూరోక్రాటన్లు బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే ప్రణాళికలో తాను, ఎలాన్ మస్క్ ఉన్నామని తెలిపారు. అలా ఈ దేశాన్ని తాము కాపాడాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. మీకు ఎలాన్‌ మస్క్‌ గురించి ఇంకా తెలుసో లేదో..! ఆయన ఉలి తీసుకురాలేదు. రంపం తెచ్చారు. మేం దాన్ని బ్యూరోక్రసీకి వాడాలనుకుంటున్నాం. గత నాలుగేళ్లలో మన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. మనం ఇప్పుడు పతనం అంచున ఉన్నాం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో మనం కొనసాగకూడదు. మంచిరోజులు ముందున్నాయి. అమెరికాలో కొత్త పొద్దు పొడవనుంది. నిబద్ధత, కఠిన శ్రమతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేం సిద్ధమవుతున్నాం. జాతితో సంబంధం లేకుండా నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆశయం’’ అని రామస్వామి వివరించారు.

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌ .. తన గెలుపుకోసం కృషి చేసిన వారిని కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామిలకు తన కార్యవర్గంలో చోటు కల్పించారు. వీరిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ సంయుక్త సారథులుగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో వీరు కీలక మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డోజ్‌ విభాగం కోసం ఉద్యోగుల నియామకాలు కూడా ప్రారంభించారు. ఈ మేరకు ఈ శాఖ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. మస్క్‌, వివేక్‌ కోసం 80 గంటలు పనిచేసేవారు, సూపర్‌ హై ఐక్యూ ఉన్న దరఖాస్తు చేసుకోవాలని ఆ పోస్ట్‌లో పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.