TCS కు US సెనేటర్ల లేఖ వీడియో
యూఎస్ సెనేటర్లు టీసీఎస్‌కు లేఖ రాసి, హెచ్-1బీ వీసాలు, అమెరికన్ ఉద్యోగుల తొలగింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అమెరికన్ సిబ్బందిని తొలగిస్తూ, విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కారణాలు, జీతాల వివరాలపైన ఈ నెల అక్టోబర్ 10లోపు వివరణ ఇవ్వాలని సెనేటర్లు డిమాండ్ చేశారు.
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)పై అమెరికన్ సెనేటర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. హెచ్-1బీ వీసాలపై కంపెనీ విధానాలకు సంబంధించి వివరాలు కోరుతూ టీసీఎస్ సీఈఓకు సెనేటర్లు లేఖ రాశారు. అమెరికాలో టీసీఎస్ అనుసరిస్తున్న నియామక ప్రక్రియ, ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారుల నియామకంపై వివరాలు ఆరా తీశారు.అమెరికన్ ఉద్యోగులను హెచ్-1బీ వీసాదారులతో భర్తీ చేశారా, అమెరికన్ సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలకు, హెచ్-1బీ వీసాదారులకు చెల్లిస్తున్న వేతనాలకు మధ్య తేడాలు ఏమిటని సెనేటర్లు లేఖలో ప్రశ్నించారు. ఈ వివరాలపై అక్టోబర్ 10లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించారు.
మరిన్ని వీడియోల కోసం :
