China: తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు.. వీడియో

|

Oct 07, 2021 | 9:52 AM

తైవాన్‌ విషయంలో మరోసారి రెచ్చిపోయింది చైనా. తైవాన్‌లోకి మళ్లీ చైనా వైమానిక దళం చొరబడింది. మొత్తం 38 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు తైవాన్‌ ఆరోపించింది.

తైవాన్‌ విషయంలో మరోసారి రెచ్చిపోయింది చైనా. తైవాన్‌లోకి మళ్లీ చైనా వైమానిక దళం చొరబడింది. మొత్తం 38 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు తైవాన్‌ ఆరోపించింది. ఒక్క నెలలోనే 60 సార్లు తమ సరిహద్దులోకి చొరబడిందని తెలిపింది. అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల హెచ్చరికల తర్వాత కూడా తైవాన్‌ను భయపెట్టడం చైనా ఆపడం లేదు. చైనా తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1 న 38 ఫైటర్ జెట్లతో ప్రదర్శనలు నిర్వహించింది. ఈ జెట్‌లు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశింయని తెలిపింది తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ. Z-18 జే 16హెలికాప్టర్లు, 4 సుఖోయ్-30 విమానాలు, అణుబాంబులు జారవిడిచే సామర్థ్యం ఉన్న రెండు హెచ్‌-6 బాంబర్లతో ప్రదర్శన నిర్వహించి తైవాన్‌ను భయపెట్టేందుకు ప్రయత్నించింది చైనా.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Maa Elections 2021: బాలయ్య విష్ణు వైపే.. థాంక్స్ చెప్పిన విష్ణు.. వీడియో

Nani: నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా అడుగులు.. వీడియో

Follow us on