జాక్ పాట్ కొట్టిన చైనా.. ఇక బంగారమే బంగారం వీడియో

Updated on: Nov 23, 2025 | 5:01 PM

చైనా తన చరిత్రలోనే అతిపెద్ద బంగారు గనిని తూర్పు లియానింగ్ ప్రావిన్స్‌లో కనుగొంది. దీనిలో 1440 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. దాదాపు 192 బిలియన్ డాలర్ల విలువైన ఈ జాక్ పాట్, చైనా ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం ఇవ్వడంతో పాటు ప్రపంచ పసిడి మార్కెట్‌పై భారీ ప్రభావం చూపనుంది.

చైనా తూర్పు లియానింగ్ ప్రావిన్స్‌లో దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు గనిని కనుగొంది. చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం, 21వ శతాబ్దంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ గనిలో 1440 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీని మొత్తం విలువ దాదాపు 192 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 17,08,800 కోట్ల రూపాయలు) ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.AI, శాటిలైట్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ గనిని గుర్తించారు. ప్రభుత్వ ఆధీనంలోని లియానింగ్ జియాలజికల్ అండ్ మైనింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో వెయ్యి మంది సాంకేతిక నిపుణులు, కార్మికులు ఏడాది పాటు చేసిన అన్వేషణ ఫలితంగా ఈ భారీ నిక్షేపాలు బయటపడ్డాయి.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో

 

Follow Us