అమెరికాలో బొద్దింకల రాజధాని !! సర్వేలో వెల్లడి

|

Jun 02, 2024 | 9:46 PM

అందరూ ఊహించుకుంటున్నట్లుగా అమెరికా అంటే ఆకాశహర్మ్యాలు, పరిశుభ్రమైన రోడ్లు, సుందరమైన బీచ్ లే కాదండోయ్.. అగ్రరాజ్యం అంటే చెత్తా చెదారం, కాలుష్యం, బొద్దింకలు, ఎలుకలు కూడానట! తాజా అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. లాన్ స్టార్టర్ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం టెక్సాస్ రాష్ర్టంలోని హ్యూస్టన్ నగరం అమెరికాలోకెల్లా అత్యంత చెత్తనగరంగా నిలిచింది! ఈ నగరంలో గాలి నాణ్యత దారుణంగా ఉందని సంస్థ పేర్కొంది.

అందరూ ఊహించుకుంటున్నట్లుగా అమెరికా అంటే ఆకాశహర్మ్యాలు, పరిశుభ్రమైన రోడ్లు, సుందరమైన బీచ్ లే కాదండోయ్.. అగ్రరాజ్యం అంటే చెత్తా చెదారం, కాలుష్యం, బొద్దింకలు, ఎలుకలు కూడానట! తాజా అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. లాన్ స్టార్టర్ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం టెక్సాస్ రాష్ర్టంలోని హ్యూస్టన్ నగరం అమెరికాలోకెల్లా అత్యంత చెత్తనగరంగా నిలిచింది! ఈ నగరంలో గాలి నాణ్యత దారుణంగా ఉందని సంస్థ పేర్కొంది. ఎప్పుడు కూలుతాయో అన్నట్లుగా కనిపించే భవనాలు, ఎటుచూసినా బొద్దింకలు నగరమంతా కనిపిస్తుంటాయని వివరించింది. అలాగే శాన్ ఆంటోనియో, టాంపా నగరాల్లోనూ బొద్దింకల సమస్య తీవ్రంగా ఉందని నివేదిక తెలిపింది. ఈ మూడు నగరాలను బొద్దింకల రాజధానులుగా చెప్పొచ్చని సర్వే ఎద్దేవా చేసింది. ఇక బోస్టన్, ఫిలడెల్ఫియా, బాల్టిమోర్ నగరాల్లో ఎలుకలు దండయాత్ర చేస్తుంటాయట. ఎలుకలు అంటే భయపడే వారు ఈ నగరాలకు వెళ్లకపోవడమే మంచిదని అధ్యయనం సూచించింది. అలాగే అందరూ ఊహించినట్లుగా న్యూయార్క్ నగరం కూడా అంత అందమైన నగరం ఏమీ కాదట. పరిశుభ్రత విషయంలో ఈ నగరం 12వ స్థానానికే పరిమితమని సర్వే సంస్థ పేర్కొంది. ఈ రాష్ర్టంలోని శాన్ బెర్నార్డినో నగరాన్ని నాలుగో చెత్త నగరంగా ఎంపిక చేసింది. ఆ నగరంలో గాలి నాణ్యత దారుణంగా ఉంటుందని లాన్ స్టార్టర్ తెలిపింది. అలాగే రివర్ సైడ్, ఒంటారియో నగరాల్లో భరించలేని దుర్గంధం వ్యాపిస్తుంటుందని వివరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెయిలింగ్‌ పైనుంచి దూకుతున్న మొసలిని చూశారా ??

అరుదైన పామును పట్టుకున్నారు.. వీడియో వైరల్ చేసి బుక్‌ అయ్యారు

తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్‌ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. రిలీజ్ కు రెడీగా కల్కి ట్రైలర్

సీరియల్ హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ పెళ్లి ?? ఇదిగో క్లారిటీ

Follow us on