భారత్‌నే బెదిరిస్తావా.. ట్రంప్ ?? పుతిన్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ధ్వజమెత్తారు. భారత్, చైనాలు వెనకేసుకొచ్చారు. ఆసియాలో ఆర్థికంగా ప్రబలమైన రెండు భారత్, చైనాలపై ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ వ్యవహరించడం సరికాదని చివాట్లు పెట్టారు. పాతకాలం నాటి వలసవాద ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేయడం మూర్ఖత్వమేనని పుతిన్.. హితవు పలికారు.
బీజంగ్‌లో చైనా నిర్వహించిన ఆయుధ ప్రదర్శనను తిలకించిన అనంతరం పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, చైనాలు రెండూ జనాభాపరంగా పెద్ద దేశాలు. వాటికి రాజకీయ వ్యవస్థలు, సొంత చట్టాలు ఉన్నాయి. అలాంటి పెద్ద దేశాలను శిక్షిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసే ముందు.. ఆ దేశాల పాలకులుగా ఎవరున్నారో.. ఓసారి ట్రంప్ ఆలోచించుకోవాలి. ఎన్నో క్లిష్టమైన సమస్యలను అధిగమించి.. నేడు ప్రపంచం ముందు సగర్వంగా నిలబడిన ఆ రెండు దేశాలు.. తమను హెచ్చరించే వారి విషయంలో ఎలా ప్రతిస్పందిస్తాయో కూడా అమెరికా అధ్యక్షుడికి ఓ ముందస్తు అంచనా ఉండాలి. ’అని పుతిన్ వ్యాఖ్యానించారు. వలసవాదులతో దీర్ఘకాలం సుదీర్ఘ పోరాటం చేసిన ఆ రెండు దేశాల నేతల గురించి ట్రంప్‌కు ఇంకా బాగా తెలిసినట్లు లేదు’అని తనదైన శైలిలో మోదీ, జిన్‌పింగ్‌లను పుతిన్ ప్రశంసించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, చివరికి అన్ని విషయాలూ కొలిక్కివస్తాయని పుతిన్ అన్నారు. మళ్లీ ఆయా దేశాల మధ్య సాధారణ పరిస్థితులు చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కేవలం ఓ సాకుగా చూపి టారీఫ్ లతో ట్రంప్ రెచ్చిపోతున్నారని అన్నారు. దీనికి ఉదాహరణగా ఉక్రెయిన్ యుద్ధానికి ప్రత్యక్ష సంబంధం లేని బ్రెజిల్ దేశంపై అమెరికా అదనపు సుంకాలను విధించడాన్నీ పుతిని ఎత్తి చూపారు. అయితే భారత్ లక్ష్యంగా అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ కుట్రలు, కుయుక్తులు కంటిన్యూ అవుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో ఇప్పటికే ట్రంప్ భారత్‌పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. దాంతో.. ప్రస్తుతం భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్‌లు అమలులో ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ganesh Nimajjanam 2025: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అఘోరాలు.. గొరిల్లా..
Yadagirigutta: యాదగిరి నరసన్నకు భక్తుడి భారీ విరాళం
చిమ్మ చీకటి.. జోరువాన.. సెల్ లైట్ వెలుగులో డెలివరీ
రూ. 8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక