గ్రీన్‌లాండ్‌ కు సైనిక బలగాల తరలింపు

Updated on: Jan 20, 2026 | 6:20 PM

అమెరికా, డెన్మార్క్‌ మధ్య గ్రీన్‌లాండ్‌ వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుండగా, డెన్మార్క్‌, యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్‌లాండ్‌కు వ్యూహాత్మక ప్రాముఖ్యత, అపారమైన ఖనిజ నిల్వలు ఉండటమే ట్రంప్‌ ఆసక్తికి కారణం. డెన్మార్క్‌ సైనిక చర్యలకు హెచ్చరించగా, నాటో దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ వివాదం అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అమెరికా డెన్మార్క్‌ మధ్య గ్రీన్‌లాండ్‌ వివాదం ముదురుతోంది. గ్రీన్‌లాండ్‌ ను ఎలాగైనా సొంతం చేసుకుంటామని ట్రంప్‌ స్పష్టం చేసారు. లేని పక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైా స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌ సమీపంలో స్థావరాలను నిలిపి ఉన్నట్లు చెప్పారు. ట్రంప్‌ ఆరోపణల్లో నిజం లేదని రష్యా చైనా దేశాలు గ్రీన్లాండ్‌ కు సుదూర ప్రాంతం బేరింగ్ సముద్రంలో తమ స్థావరాలను మోహరించినట్లు గ్రీన్‌లాండ్‌ ప్రభుత్వం వాదిస్తోంది. ఐరోపా దేశాలు గ్రీన్‌లాండ్‌లో ఉన్న డెన్మార్క్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. గ్రీన్‌లాండ్‌ భద్రత ‘నాటో’ ఉమ్మడి బాధ్యత అని తెలిపాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్‌ దేశాలు తమ బలగాలను గ్రీన్‌లాండ్‌ కు తరలించాయి. గ్రీన్‌లాండ్‌ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధించారు ట్రంప్‌. దీన్ని ఐరోపా దేశాలు తీవ్రంగా ఖండించాయి. తప్పుడు చర్యగా బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్పందిస్తూ.. ట్రంప్‌ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అమెరికా తీరుకు వ్యతిరేకంగా గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌లో వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గ్రీన్‌లాండ్‌ పై ట్రంప్‌ ఆసక్తికి చాలా కారణాలున్నాయి. యూరప్‌ ఉత్తరఅమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. ఇక్కడ్నంచి రష్యా నావికా దళాల కదలికలపై ఓ కన్నేసి ఉంచవచ్చన్నది ట్రంప్‌ ప్లాన్‌. అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. వాయువ్య గ్రీన్లాండ్‌లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. గ్రీన్‌లాండ్‌ అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వల ఖజానా. మంచు దుప్పటి కింద నేలలో అత్యంత అరుదైన గ్రాఫైట్‌ లిథియం వంటి 25 ఖనిజాలు అక్కడ అపారంగా ఉన్నాయి. విద్యుత్‌ వాహనాల తయారీలో ఇవి కీలకం. గ్రీన్‌లాండ్‌ తమకు చిక్కితే ఇక ఆ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడాల్సిన అవస్థ ఉండదన్నది ట్రంప్‌ యోచన అని చెబుతున్నారు నిపుణులు.గ్రీన్‌లాండ్‌ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని డెన్మార్క్‌ రక్షణమంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గ్రీన్‌లాండ్‌లో అడుగుపెడితే కాల్చిపారేస్తామని అమెరికాకు డెన్మార్క్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్‌ రిపోర్ట్

A.R. Rahman: ‘ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరు’

అందగత్తెల రీయూనియన్.. సందడి.. సందడి చేసిన ముద్దుగుమ్మలు

AR Rahman: మాటలు కాదు.. ముందు మ్యూజిక్ మీద దృష్టి పెట్టు