విదేశీ ఉద్యోగులు లేకపోతే కష్టం

Updated on: Nov 22, 2025 | 2:00 PM

డొనాల్డ్ ట్రంప్ వలసలపై తన కఠిన వైఖరిని మార్చుకున్నారు. అమెరికా టెక్నాలజీ, ఆర్థిక వృద్ధికి విదేశీ నిపుణులు అవసరమని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వలసలను స్వాగతిస్తూ, హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సమర్థించారు. విదేశీయులు అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి స్వదేశాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. లేకుంటే అమెరికా విజయం సాధించదని పేర్కొన్నారు.

వలసల విషయంలో తన కఠిన వైఖరికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధికి విదేశీ నిపుణుల అవసరం ఎంతో ఉందని, అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు వేలాది మందిని ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వలసలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు. అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరమ్‌లో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నామని, అవి దేశ ఆర్థికవృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ ప్లాంట్లలో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన విదేశీయులను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలన్నారు. యూఎస్‌లోని కంపెనీల్లో బిలియన్‌ డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టే వారిని అనుమతించకపోతే.. తాము విజయం సాధించలేమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికాకు వచ్చే విదేశీ ఉద్యోగులు స్థానికులకు నైపుణ్యాలు నేర్పించి తిరిగి స్వదేశాలకు వెళ్లొచ్చన్నారు. విదేశీ వృత్తి నిపుణులు వేలాది మందిని తమతో తీసుకురావాలని.. వారిని తాను స్వాగతిస్తానని ట్రంప్‌ చెప్పారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. ఇది మాగా (MAGA) సభ్యులకు అర్థం కాలేదంటూ అసహనం వ్యక్తంచేశారు. విదేశీ ఉద్యోగులను అనుమతించకపోతే తాము విజయం సాధించలేమని అంగీకరించారు. ట్రంప్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల హెచ్‌1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. విదేశీ వృత్తి నిపుణుల కారణంగా అమెరికన్లకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదని మొన్నటి వరకు ట్రంప్‌ వాదించారు. ప్రస్తుతం దీనిపై ఆయన స్వరం మార్చారు. హెచ్‌-1బీ వీసా కార్యక్రమాన్ని ట్రంప్‌ సమర్థించారు. ప్రపంచంలోని ప్రతిభావంతులను అమెరికాకు తీసుకువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని.. వారు యూఎస్‌కు వచ్చి స్థానికులకు నైపుణ్యాలు నేర్పించి వెళ్లాలంటూ సూచనలు చేశారు. కానీ, ట్రంప్‌ నిర్ణయాలను మాగా సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రీ రిలీజ్‌లో మాటల తూటాలు.. వీటితో టిక్కెట్లు తెగుతాయా ??

మనం అనుకున్నదొక్కటి.. అక్కడ చూపించింది ఇంకొకటి!

పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది

ఉస్తాద్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!

ఆంధ్రాకింగ్‌ రామ్‌కి సక్సెస్‌ తెచ్చిపెడుతుందా ??