టార్గెట్‌ భారత్‌.. ఐటీపై కత్తికట్టిన ట్రంప్‌ వీడియో

Updated on: Sep 10, 2025 | 1:45 PM

అమెరికా టార్గెట్‌ ఒక్కటే.. అది భారత్‌ను దారిలోకి తెచ్చుకోవడం. ఇండియాని చెప్పుచేతుల్లో పెట్టుకోవడం కోసమే ట్రంప్ ట్రేడ్‌వార్‌కు తెరతీశాడు. భరించలేనంతగా టారిఫ్‌లను పెంచిపారేశాడు. అయితే పిక్చర్‌ ఔర్‌ బాకీ హై.. అన్నట్లు రెండో దశ టారిఫ్‌లకు కత్తి నూరుతున్నారు. ఇండియాకు ఎక్కువ డాలర్లు తెచ్చిపెట్టే ఐటీ సెక్టార్‌ను చావుదెబ్బ కొట్టాలనుకుంటున్నారు. అమెరికాలోని అత్యధికుల్లో ఐీ రంగంలో పనిచేయటం, వారు తమ సంపాదనలో పెద్దమొత్తాలను తిరిగి ఇండియా పంపించటంతో.. ట్రంప్ వారిని తన లక్ష్యంగా మార్చుకుంటున్నాడు.

ఆంక్షల పేరుతో అష్టదిగ్భంధనం చేసి.. వారి సంఖ్యను తగ్గించే ప్రయత్నాల్లో ట్రంప్ యంత్రాంగం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని అనేక కంపెనీలకు అవసరమైన ఐటీ సేవలను పలు భారతీయ ఐటీ సంస్థలు అందిస్తున్నాయి. అక్కడి బ్యాంకులు, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, షాపింగ్‌ మాల్స్, చివరకు కాఫీ షాప్స్‌కు కూడా సాఫ్ట్‌వేర్‌‌ వరకు అందిస్తున్నది భారతీయ కంపెనీలే. అలాగే, మన టెక్‌ కంపెనీలన్నీ.. అమెరికా ప్రాజెక్టులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ఐటీ సెక్టార్‌ను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు, ఐటీ సేవలకు ప్రపంచంలోనే అతిపెద్ద ఔట్‌సోర్సింగ్‌ సెంటర్‌‌గా మన దేశం మారింది. దీని మార్కెట్‌ సైజ్‌ 26 లక్షల 45వేల కోట్ల రూపాయలు కాగా, 56.7 లక్షల ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా కేవలం వస్తువుల మీదనే పన్నులు విధించిన ట్రంప్.. ఇకపై సేవల మీదా ఫోకస్ పెంచారు.

మరిన్ని వీడియోల కోసం :

జాగ్రత్త : కారు సన్‌రూఫ్‌ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో

విశాఖపట్నంలో ఘనంగా మహాసిమెంట్స్‌ వార్షిక సమావేశం వీడియో

ఢిల్లీలో ఒక్కసారిగా కూలిన భవనం వీడియో

తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో