Moscow: మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.

|

Mar 26, 2024 | 11:54 AM

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. దాడులకు పాల్పడిన అనుమానితులను అరెస్ట్‌ చేసి ఆదివారం మాస్కోలెని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వీరిలో తాజాగా ముగ్గురు ముష్కరులు తమ నేరాన్ని అంగీకరించారు.

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. దాడులకు పాల్పడిన అనుమానితులను అరెస్ట్‌ చేసి ఆదివారం మాస్కోలెని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వీరిలో తాజాగా ముగ్గురు ముష్కరులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ నలుగురినీ మే 22 వరకూ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్‌కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలతో రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించారు. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్‌కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on