బీచ్‌లో వేలాది చేపలు మృతి.. రీజన్ తెలిస్తే షాక్ !!
ప్రకృతిలో సంభవించే మార్పులు జీవరాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా ఓ బీచ్ లో చేపలకు ఆక్సిజన్ అందక వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన అమెరికా టెక్సాస్‌లోని గల్ఫ్ కోస్ట్ బీచ్‌లో గత వారం చోటు చేసుకుంది. బ్రియాన్ బీచ్‌లో వేలకొద్దీ మెన్‌హడెన్ జాతికి చెందిన వేలాది చేపలు చనిపోయి తీరానికి కొట్టుకొచ్చాయని
ప్రకృతిలో సంభవించే మార్పులు జీవరాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా ఓ బీచ్ లో చేపలకు ఆక్సిజన్ అందక వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన అమెరికా టెక్సాస్‌లోని గల్ఫ్ కోస్ట్ బీచ్‌లో గత వారం చోటు చేసుకుంది. బ్రియాన్ బీచ్‌లో వేలకొద్దీ మెన్‌హడెన్ జాతికి చెందిన వేలాది చేపలు చనిపోయి తీరానికి కొట్టుకొచ్చాయని ఫాక్స్ న్యూస్ ఓ కథనంలో పేర్కొంది. దీనిపై స్పందించిన అధికారులు ఎండల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, దీంతో సరిపడా ఆక్సిజన్ అందక చేపలు మృతిచెందుతున్నాయని వివరణ ఇచ్చారు. ‘‘ నీళ్లు వేడెక్కితే అందులో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నీటి ఉష్ణోగ్రత 70 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువైతే మెన్‌హెడెన్ లాంటి చేపలు మనుగడ సాగించలేవని, క్వింటానా బీచ్ కౌంటీ పార్క్ అధికారులు వెల్లడించారు. మెన్‌హెడెన్ జాతికి చెందిన చేపలు గుంపుగుంపులుగా జీవనం సాగిస్తాయి. ఒక్కో గుంపులో వందల కొద్దీ చేపలు ఉంటాయి. కెనడా తీరం నుంచి దక్షిణ అమెరికా వరకు ఇవి సంచరిస్తుంటాయి. ఇవి ఎప్పుడూ గుంపులు గుంపులుగా తిరగడం వల్లే.. ఏదైనా ఆపద వచ్చినప్పుడు వేల సంఖ్యలో చేపలు ఒకేసారి ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. తాజా ఘటన కూడా అదే కోవలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ‘‘నీటి అడుగుభాగం కంటే ఉపరితల జలాలు త్వరగా వేడెక్కుతాయి. ఈ సమయంలో చేపల గుంపు అందులో చిక్కుకుంటే మొప్పల ద్వారా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అమెరికా జాతీయ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారన్‌హీట్‌గా నమోదైనట్లు పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు
వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??
TOP 9 ET News: ‘ప్రేమలో ఉన్నా..’ ఒప్పేసుకున్న తమన్నా| అక్షరాలా రూ. 486కోట్లు ఇది ఏ హీరో వల్ల కాదు
Digital TOP 9 NEWS: గుజరాత్‌కు పెద్ద గండం | దేశంలోనే పెద్ద ఆస్పత్రి ఇక్కడే