ఆఫ్గనిస్థాన్‌లో వెనక్కు తగ్గిన తాలిబన్లు..! ఇంతకీ ఏం జరిగిందంటే..!(వీడియో): Taliban In Afghanistan.

|

Sep 14, 2021 | 12:02 PM

కాలకేయులు వెనక్కి తగ్గారు. ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయ్యింది.ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే...

కాలకేయులు వెనక్కి తగ్గారు. ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయ్యింది.ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే సెప్టెంబర్‌ 11న జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. దోహా నుంచి వచ్చిన ఒత్తిళ్లతో తాలిబన్లు ఈ కార్యక్రమాన్ని వాయిదావేసినట్లు సమాచారం. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయ్యింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు పూర్తయిన వేళ.. ఆఫ్గనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న నిర్వహించాలని తాలిబన్లు భావించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్థాన్, చైనా, టర్కీ, కతర్, రష్యా, ఇరాన్ దేశాలకు ఆహ్వానం కూడా పంపించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని రష్యా స్పష్టంచేసింది. అయితే సెప్టెంబర్ 11 దాడులకు 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని తాలిబన్లపై దాని కూటమి పక్షాల నేతలు ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాలిబన్లు ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు రష్యాకు చెందిన టీఏఎస్ఎస్ న్యూస్ ఏజెన్సీ వెళ్లడించింది.

సెప్టెంబర్ 11నాడు నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తాలిబన్లు రద్దు చేసుకునేలా కతర్‌పై అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలు ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 11నాడే ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అమానుషమని ఆ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆ మేరకు కతర్ పాలకులు తాలిబన్లకు కీలక సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 11నాడు ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తాలిబన్ ప్రభుత్వం పట్ల మరింత వ్యతిరేకత పెరగొచ్చని కతర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. దాంతె తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల గుర్తింపు లభించడం మరింత కష్టతరంగా మారొచ్చని తెలిపింది. ఈ ఒత్తిళ్లకు తలొగ్గి తాలిబన్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించిన ఆఫ్గన్ ప్రభుత్వ కల్చురల్ కమిషన్ సభ్యుడు సమాంఘని..ప్రజలను మరింత గందరగోళానికి గురిచేయడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం ఇప్పటికే పని మొదలుపెట్టినట్లు చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Ek Number News Live Video: పండగనాడు దొరికిన వినాయకుని వాహనం-వైరల్ న్యూస్ వీడియోస్

 రోడ్డుపక్కన చిన్న హోటల్‌లో టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వైరల్ వీడియో.: Allu Arjun at roadside hotel Video.

 సాయి తేజ్ ప్రమాదం వెనుక మరో కోణం..!డైట్స్ అండ్ డౌట్స్..!(లైవ్ వీడియో): Sai Dharam Tej Bike Accident

Published on: Sep 14, 2021 12:00 PM