USA: అమెరికాలో మరోసారి కాల్పులతో రెచ్చిపోయిన దుండగులు.. ముగ్గురు మృతి

|

Jun 18, 2022 | 9:07 AM

అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. యూఎస్ టెక్సాస్‌ ఘటన మరువక ముందే.. పశ్చిమ మేరీ ల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.


అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. యూఎస్ టెక్సాస్‌ ఘటన మరువక ముందే.. పశ్చిమ మేరీ ల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని యూఎస్ మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో భద్రతా సిబ్బందిపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఎదురు కాల్పుల్లో దుండగుడితోపాటు ఓ పోలీసు గాయపడ్డాడు. అనంతరం దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియా తెలిపింది. బాల్టిమోర్ నగరానికి 75 మైళ్ల దూరంలో ఉన్న స్మిత్స్‌బర్గ్‌లోని కొలంబియా మెషిన్ తయారీ కేంద్రం వద్ద గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు కాల్పులు జరిగినట్లు వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. వెంటనే పోలీసులు స్పందించారని వెల్లడించింది.కాగా.. గత కొన్ని రోజులుగా అమెరికాలో హింస పెరుగుతూ వస్తోంది. న్యూయార్క్, టెక్సాస్, ఓక్లహోమాలో జరిగిన ఘటనల్లో పదుల సంఖ్యలో మరణించారు. టెక్సాస్ ఘటనలో 22 మంది మరణించారు. కాగా.. తుపాకీ హింసను నియంత్రించేందుకు.. చట్టాలను మరింత కఠినం చేసేలా జోబైడన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుపాకుల కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

 

Follow us on