అమెరికా ఎన్నికల ప్రచారంలో తెలుగులో బ్యానర్లు
అమెరికాలో తెలుగువారి ప్రాబల్యం పెరిగిపోతోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవంతో పాటు భారతీయ పండుగలకు అమెరికాలో సెలవులు కూడా ఇస్తున్నారు. అక్కడి వీధులకు భారతీయ ప్రముఖుల పేర్లు పెడుతున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ తెలుగులో రాసి ఉన్న బ్యానర్లు అమెరికా వీధుల్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార హడావుడి నెలకొంది.
ఈ నేపథ్యంలో డల్లాస్ లో ‘సంస్కృతి, సన్మార్గం-దేశానికి ఆధారం’ అని రాసి ఉన్న బ్యానర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే తమిళంలో రాసిన బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి, అక్కడే ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడుతున్న తెలుగు వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికా రాజకీయాల్లో కూడా తెలుగువారు, భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత సంతతికి చెందినవారు అమెరికాలో సెనెటర్ల వంటి పదవుల నుంచి నేడు ఏకంగా ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసే స్థాయికి ఎదిగారు. డెమోక్రాట్ల తరఫున భారత సంతతికి చెందిన కమలా హారిస్ అధ్యక్ష బరిలో ఉన్నారు. రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్షుడిగా ట్రంప్ బలపర్చిన వాన్స్.. భారత సంతతికి చెందిన తెలుగు మహిళ ఉషా చిలూకూరి భర్త కావడం విశేషం. దీంతో అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు గెలిచినా భారత్‌కు గర్వకారణమే. వాన్స్ రిపబ్లికన్ల తరఫున ఉండటంతో అక్కడి తెలుగువారు ఏ పార్టీ వైపు ఉన్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో, మనవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శుభవార్త.. లైట్ మోటార్ వాహనాలకు.. టోల్ ఫీజులు రద్దు
గుర్రానికి ఊహించని షాక్ ఇచ్చిన పొట్టేలు.. ఏం చేసిందో చూడండి !!
లక్కీ లాటరీ గెలుచుకున్న నరేంద్రమోదీ.. ప్రైజ్ ఎంతంటే ??