Shaik Haseena: మళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.? షేక్ హసీనా కుమారుడు సంచలన వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు తర్వాత షేక్ హసీనా కుటుంబం భారత్‌లో ఆశ్రయం పొందుతోంది. అయితే తన తల్లి ఎక్కడికి పారిపోలేదని, బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనేలా ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని ఆమె కుమారుడు సజీబ్ వాజీద్ జాయ్. బంగ్లాదేశ్‌లో కొత్త సర్కారు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశం వెళ్తారని ఆమె కుమారుడు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు తర్వాత షేక్ హసీనా కుటుంబం భారత్‌లో ఆశ్రయం పొందుతోంది. అయితే తన తల్లి ఎక్కడికి పారిపోలేదని, బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనేలా ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని ఆమె కుమారుడు సజీబ్ వాజీద్ జాయ్. బంగ్లాదేశ్‌లో కొత్త సర్కారు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశం వెళ్తారని ఆమె కుమారుడు తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ మాట్లాడుతూ.. తన తల్లి ప్రస్తుతం ఇండియాలో ఉన్నదని, ఎన్నికలు నిర్వహించేందుకు ఎప్పుడు కొత్త సర్కారు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆమె స్వదేశం వెళ్తారన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్కారులో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ సభ్యులు ఎవరూ లేరు. ప్రస్తుతం హసీనా ఢిల్లీలో ఓ సురక్షితమైన ఇంట్లో ఉంటున్నారు. బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని ఆమె భావించినా, ఆమె అభ్యర్థనను ఆ దేశం తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ విషయం గురించి బ్రిటన్ సర్కారుతో మాట్లాడినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.