బ్రెజిల్ విమాన ప్రమాదం నుంచి ఈ ప్రయాణికుడు ఎలా తప్పించుకున్నాడో తెలుసా ??
బ్రెజిల్ లో శుక్రవారం రాత్రి ఓ విమానం కూలిపోయి అందులోని మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రయాణికుడు చిన్న పొరపాటు కారణంగా ఆ విమానం ఎక్కలేకపోయాడు. రయో డి జెనీరో ప్రాంతానికి చెందిన అడ్రియానో అసిస్ శుక్రవారం కాస్కావెల్ నుంచి గ్వారుల్‌హోస్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. టైముకు ఎయిర్ పోర్టుకు కూడా చేరుకున్నాడు.
బ్రెజిల్ లో శుక్రవారం రాత్రి ఓ విమానం కూలిపోయి అందులోని మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రయాణికుడు చిన్న పొరపాటు కారణంగా ఆ విమానం ఎక్కలేకపోయాడు. రయో డి జెనీరో ప్రాంతానికి చెందిన అడ్రియానో అసిస్ శుక్రవారం కాస్కావెల్ నుంచి గ్వారుల్‌హోస్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. టైముకు ఎయిర్ పోర్టుకు కూడా చేరుకున్నాడు. అయితే, తాను బుక్ చేసుకున్న టికెట్ ‘లాటమ్ ఎయిర్ లైన్స్’ కంపెనీదని భావించి ఆ ఫ్లైట్ కోసం లాంజ్ లో వేచి ఉన్నాడు. కాసేపటి తర్వాత టికెట్ చూసుకోగా అది ‘వోపాస్ ఎయిర్‌లైన్స్’ టికెట్.. అటుచూస్తే వోపాస్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అసిస్ హడావుడిగా బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్నాడు. కానీ అప్పటికే బోర్డింగ్ క్లోజ్ చేశామంటూ అక్కడున్న సిబ్బంది అసిస్ ను విమానంలోకి ఎక్కనివ్వలేదు. దీనిపై అసిస్ వారితో తీవ్రంగా గొడవ పెట్టుకున్నాడు. తర్వాత వోపాస్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విమానాశ్రయం మొత్తం వెతికి తనను అడ్డుకున్న ఉద్యోగిని కలిశానని, అతడిని కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పానని అసిస్ వివరించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫైవ్ స్టార్ హోటల్‌లో బాలుడి చోరీ.. రూ.1.50 కోట్లున్న బ్యాగ్‌తో పరార్ !!
నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??
ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు