రూ.700 పలుకుతోన్న కిలో టమోటా.. ఇంకేం తింటారు

Updated on: Oct 23, 2025 | 5:15 PM

మన దాయాది పాకిస్తాన్ దేశాన్ని ప్రకృతి వైపరీత్యాలు, అఫ్గానిస్తాన్‌ ఘర్షణలతో పాటుగా.. టమాటాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. నిత్యావసరాల ధరలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. ఏం తిందామన్న భయపడాల్సిన పరిస్థితి. తాజాగా టమాటా ధర పాకిస్తాన్‌లో కొండెక్కి కూర్చుంది. కిలో టమాటా ధర రూ.700 పలుకుతుండటంతో.. జనాలు టమాటా కొందామనే ఆలోచన వచ్చినా సరే భయంతో వణికిపోతున్నారు.

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, వరుస ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులన్ని కలిసి టమాటా ధరను కొండెక్కించాయి. ఈ మధ్య పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురిశాయి. వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. కుంభవ‌ృష్టి వల్ల వేలాది ఎకరాల్లో టమాటా పంట నాశనమైంది. దీంతో దేశంలో టమాటా సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. దీంతో రవాణా ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల కూడా పంట సరైన సమయానికి మార్కెట్లకు చేరక.. ధరలు భారీగా పెరిగాయి. భారత రూపాయితో పోలిస్తే.. పాకిస్తాన్ రూపాయి విలువ 31 పైసలుగా ఉంది. ఇక ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దీని ధర మరింత దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్‌లో తీవ్ర పంట నష్టం మూలంగా.. ఆఫ్గనిస్తాన్, ఇరాన్ నుంచి టమాటా దిగుమతులే వారికి ఆధారం. పాక్ రూపాయి విలువ తగ్గడం కూడా టమాటా రేటును భారీగా పెంచేసింది. ప్రస్తుత ఆర్థిక, వాతావరణ పరిస్థితుల్లో కొందరు కృత్రిమ కొరత సృష్టించి.. ధరలను ఒక్కసారిగా పెంచేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తరుముకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాల్లో స్కూల్స్‌ బంద్‌

Gold Price Down: లక్ష దిగువకు బంగారం.. ఇదీ అసలు కారణం

దీపావళి బోనస్ ఇవ్వలేదని టోల్ గేట్లు ఎత్తేసారు !! రూ. లక్షల్లో నష్టం

అరటి గెలల కోసం పోటీ.. ఏమిటి వాటికి అంత ప్రత్యేకత

బొద్దింకను చంపబోయి.. అపార్ట్‌మెంట్‌కే నిప్పటించింది