ప్లీజ్.. నీళ్లు వదలండి !! కాళ్ల బేరానికి పాకిస్తాన్
పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్పై ప్రతీకార చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మింగుడుపడని పాక్ మంత్రులు భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. అణుబాంబులు వేస్తామని ఒకరు, సింధూ నదిలో తమ నీళ్లైనా పారాలి లేదా భారతీయుల రక్తమైన పారాలంటూ మరొకరు బీరాలు పలికారు. కానీ ఇప్పుడు పాక్ మాట మార్చింది. మరోసారి కాళ్లబేరానికి వచ్చింది. మన దేశానికి ఓ లేఖ రాస్తూ.. అందులో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దుపై మరోసారి పునఃసమీక్షించుకోవాలని కోరింది.
పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన దాడిలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భారత్.. ఈ దాడి చేసింది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులేనని గుర్తించింది. దీంతో అటు దౌత్యపరంగా ఇటు సైనిక పరంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి పాకిస్థాన్‌కు నీళ్లు వెళ్లకుండా చేస్తోంది. అయితే ఈ ఒప్పందం రద్దు తర్వాత పాకిస్థాన్ మంత్రులంతా భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ నీళ్లను ఆపేస్తే తామేమీ ఊరుకోమని, యుద్ధం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఈ నదిపై నిర్మాణాన్ని అయినా బాంబులు పెట్టి పేల్చేస్తామని అన్నారు. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో ఏమన్నారంటే.. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలి లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా భారత్‌ను భయపెట్టే ప్రయత్నం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ మాట వెనక్కి తీసుకున్న టీటీడీ.. ఖుషీ ఖుషీగా.. భక్తులు
నాకు ఇంటరెస్ట్ లేదు.. లేడీ అఘోరీ నన్ను బలవంతం చేసింది
బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. ఇక ప్రశాంతంగా అక్కడ కూడా కూర్చోలేమా !!