ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరు కోరుకోరన్నారు. ఘర్షణలు వద్దు ప్రపంచానికి శాంతి కావాలన్నారు ట్రంప్. భారత్ ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో. భారత్ యాక్షన్ కి కౌంటర్ గా పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దు. భారత్ పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయవద్దన్నారు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని యూఏఈ సూచించింది.