Norway Princess: రాజభోగాలు వదిలి.. అతని వెంట వెళ్లిన యువరాణి..! ఎం మాయ చేసావ్ గురు.. వీడియో.

Norway Princess: రాజభోగాలు వదిలి.. అతని వెంట వెళ్లిన యువరాణి..! ఎం మాయ చేసావ్ గురు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 12, 2022 | 7:29 PM

అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ నార్వే యువరాణి మార్థా లూయీస్‌ వదులుకున్నారు.


అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ నార్వే యువరాణి మార్థా లూయీస్‌ వదులుకున్నారు. ఈ మేరకు తాజాగా సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్‌ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఆరవ తరం షమన్‌ అయిన డ్యూరెక్‌ వెరెట్‌తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్‌ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్‌తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్‌ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్‌లో జరిగిన ఓ పోల్‌ వెల్లడించింది. దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్‌కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన‍్నారు. అయితే, ఆమె తన భర్త అరిబెన్‌తో విడిపోయారు. గత జూన్‌లో షమన్‌ వెరెట్‌తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్‌ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..