20 లక్షల ఏళ్లుగా వాన పడలే !! ఎక్కడో తెలుసా ?? వీడియో
అదొక మంచు ప్రదేశం... అతి శీతల ప్రదేశం.. అయినా లక్షల ఏళ్ళుగా ఆ ప్రదేశం వర్షాలకు నోచుకోలేదు.. అది పూర్తిగా మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ఖండంలోని 'కరువు' ప్రాంతం.
అదొక మంచు ప్రదేశం… అతి శీతల ప్రదేశం.. అయినా లక్షల ఏళ్ళుగా ఆ ప్రదేశం వర్షాలకు నోచుకోలేదు.. అది పూర్తిగా మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ఖండంలోని ‘కరువు’ ప్రాంతం. అతి శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో దాదాపు 4,800 చదరపు కిలోమీటర్ల మేర అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ‘డ్రై వ్యాలీస్’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటంగానీ, మంచు కురవడంగానీ జరగలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ, మంచుగానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్ 14 నుంచి మైనస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గడ్డ కట్టించే చలి ఉంటుంది.
Also Watch:
Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో