Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Phani CH

|

Updated on: Jan 29, 2022 | 7:17 PM

పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు కొందరు. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ పిల్లలగా భావించి.. వేడుకలను జరుపుతారు.

పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు కొందరు. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ పిల్లలగా భావించి.. వేడుకలను జరుపుతారు. తాజాగా గర్భంతో ఉన్న పిల్లలులకు సీమంతం జరిపించారు తమిళనాడులోని ఒక కుటుంబం. పిల్లి జాతి కోసం బేబీ షవర్‌ను నిర్వహించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన ఓ కుటుంబం పెంచుకుంటున్న రెండు పెర్షియన్ పిల్లులకు అంగరంగ వైభంగా సీమంతం వేడుకను జరిపించారు. ఈ సందర్భంగా స్నేహితులకు, సన్నిహితులకు భారీగా పార్టీ ఇచ్చారు. పెంపుడు జంతువులకు పెట్ క్లినిక్‌లో నిర్వహించిన బేబీ షవర్ వేడుకలో.. గర్భవతులైన పిల్లులను కొత్త బట్టలతో, పూలమాలలతో అలంకరించారు. వాటికి ప్రత్యేక ఆహార పదార్ధాలతో విందుఇచ్చారు. ఈ పిల్లులు మా ఫ్యామిలీ మెంబర్స్.. అందుకే గర్భం దాల్చిన వాటికి సీమంతం చేశామని వాటి యజమానులు చెప్పారు.