ఉద్యోగుల జీతాలు పెంచిన యజమానులకు మూడేళ్లు జైలు..

|

Jul 08, 2024 | 9:29 PM

షాపులో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచిన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పని చేశారంటూ పది మంది షాపు ఓనర్లను మిలటరీ కోర్టు ముందు నిలబెట్టారు. నేరం నిరూపణ అయితే ఆ పదిమందికీ ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు. మన పొరుగు దేశం మయన్మార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

షాపులో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచిన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పని చేశారంటూ పది మంది షాపు ఓనర్లను మిలటరీ కోర్టు ముందు నిలబెట్టారు. నేరం నిరూపణ అయితే ఆ పదిమందికీ ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు. మన పొరుగు దేశం మయన్మార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో బర్మాగా వ్యవహరించిన మయన్మార్ దేశంలో ప్రస్తుతం మిలటరీ పాలన కొనసాగుతోంది. మయన్మార్ లో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో సైనిక పాలనపై ప్రజల్లో తిరుగుబాటు రేగే అవకాశం ఉందని మిలటరీ భయపడుతోందని, ఎక్కడికక్కడ కఠినంగా వ్యవహరిస్తోందని అక్కడి లాయర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల జీతాలు పెంచిన పదిమంది షాప్ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయా షాపుల ముందు ‘సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు షాపు యజమానిని అరెస్టు చేయడమైనది’ అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం !!

జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం.. ఎందుకంటే ??