గాజా నుంచి వెళ్లిపోండి, లేదా ఉగ్రవాదులుగా పరిగణిస్తాం

|

Oct 23, 2023 | 9:31 AM

హమాస్‌-ఇజ్రాయెల్‌ దాడుల నేపధ్యంలో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు పక్షాల దాడులతో గాజా గజగజలాడుతోంది. ఆహారం, నీళ్లు, విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడమే కాకుండా, అక్కడి ప్రజలను ఉన్నపాటుగా ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ ఆదేశించింది. దిక్కుతోచని స్థితిలో పాలస్తీనియన్లు దక్షిణగాజాకు వలసపోయారు. కొందరు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మందులు, ఆహారం లేక పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

హమాస్‌-ఇజ్రాయెల్‌ దాడుల నేపధ్యంలో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు పక్షాల దాడులతో గాజా గజగజలాడుతోంది. ఆహారం, నీళ్లు, విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడమే కాకుండా, అక్కడి ప్రజలను ఉన్నపాటుగా ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ ఆదేశించింది. దిక్కుతోచని స్థితిలో పాలస్తీనియన్లు దక్షిణగాజాకు వలసపోయారు. కొందరు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మందులు, ఆహారం లేక పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ లోని గాజాను సందర్శించారు. వారికి భారీ సాయం చేయడమే కాకుండా, మరోవైపు యుద్ధం విస్తరించకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అమెరికాతోపాటు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సహాయ సామగ్రి గాజాకు తరలివెళ్లడానికి వీలుగా ఇజ్రాయిల్ కూడా తన అభ్యంతరాలను పక్కనబెట్టింది. మొత్తానికి అలా గాజా తలుపులు తెరుచుకున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడలో కొండచిలువతో సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ ??

Onion price rise: టమాటా శాంతించిందనుకుంటే.. ఇప్పుడు ఉల్లి షాకిస్తోంది

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ

తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్

మెట్రోలో ప్రయాణికుడికి ఇబ్బంది.. ఫైన్‌ కట్టిన మెట్రో