బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన టూరిస్ట్‌లు వీడియో

Updated on: Jun 10, 2025 | 1:21 PM

ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో భారీగా బూడిద ఎగసిపడుతోంది. సిసిలీ ద్వీపంలోని ఓ పర్వత ప్రాంతానికి పర్యాటకులు చేరుకొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. అగ్నిపర్వతం బద్దలవడంతో పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. వారిలో భయం కనిపించింది. ఎందుకంటే లావా ప్రవాహం వారి వైపు వస్తున్నట్లు కనిపించింది.

అదే సమయంలో కొంతమంది టూరిస్టులు మాత్రం దూరం నుంచి ఆ దృశ్యాలను వారి ఫోన్లలో బంధించారు. పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతుండడంతో ప్రజలంతా మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో మౌంట్ ఎట్నా ఒకటని ఇటలీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ తెలిపింది. గత పదేళ్లుగా ఇది చురుకుగా ఉన్నట్లు చెప్పింది. అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగసిపడుతూనే ఉందని ఇలాగే కొనసాగితే మరిన్ని విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

“మూగ మనసులు’ సినిమాలో ..సావిత్రి నివాసం ఉన్న భవనం ఇదే వీడియో

ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి వరుడు వీడియో

బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో