Expensive Fish: కోటి విలువైన కోనేం చేపలు లభ్యం.! ఉప్పాడ సంద్రంలో అరుదైన ఘటన..
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. అమీనాబాద్ మినీ ఫిషింగ్ అర్బర్‌లో టన్నులు కొద్ది కోనేం చేపలు వలకు చిక్కాయి.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. అమీనాబాద్ మినీ ఫిషింగ్ అర్బర్‌లో టన్నులు కొద్ది కోనేం చేపలు వలకు చిక్కాయి. ఉప్పాడకు చెందిన వంకా సత్తిబాబు, ఉమ్మిడి అప్పారావులు వేసిన వలకు కోనేం చేపలు చిక్కడంతో రేవులో సందడి వాతావరణం ఏర్పడింది. ఒకే వలకు కోటి రూపాయలకుపైగా విలువైన కోనేం జాతికి చెందిన చేపలు లభ్యమయ్యాయి. మత్స్యజాతుల్లో ఎంతో ఖరీదైన ఈ జాతి చేపలు చిక్కాయి. ఒక్కో చేప అయిదు కిలోలకు పైగా ఉంది. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మరో ఇద్దరు మత్సకారులు వెళ్లి మూడు బోట్లలో తీసుకు వచ్చారు. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చి బహిరంగ వేలం నిర్వహించగా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులు వీటిని కోటి ముప్పై లక్షలకు వేలంలో పాడుకున్నారు. ఈ చేపలు సుమారుగా 13 టన్నులు బరువును కలిగి ఉన్నాయని అంటున్నారు మత్య్సకారులు. దీంతో వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..