Mosquito Burgers: దోమల బర్గర్లు ఎప్పుడైనా తిన్నారా..? దోమల్లో మాంసం కంటే 7 రెట్లు ఎక్కువ ప్రొటీన్లు.?
ప్రపంచంలో ఆసియా తర్వాత రెండవ అతి పెద్ద ఖండం ఆఫ్రికా. అత్యంత తక్కువ ఆయుష్షు కలిగిన ప్రజలు ఈ ఖండంలోనే వారే.. ఇక్కడి వారికి తినడానికి సరైన తిండి కూడా లేనివారి సంఖ్య ఎక్కువే. అందుకనే తమకు దొరికిన...
ప్రపంచంలో ఆసియా తర్వాత రెండవ అతి పెద్ద ఖండం ఆఫ్రికా. అత్యంత తక్కువ ఆయుష్షు కలిగిన ప్రజలు ఈ ఖండంలోనే వారే.. ఇక్కడి వారికి తినడానికి సరైన తిండి కూడా లేనివారి సంఖ్య ఎక్కువే. అందుకనే తమకు దొరికిన పదార్ధాలతో ఆహారాన్ని తయారు చేసుకుని తింటారు. తాజాగా ఆ దేశస్థులు కొత్తగా దోమలతో బర్గర్లు తయారుచేసుకుని తింటున్నారట. దీన్ని కొందరు అసహించుకుంటుంటే.. మరికొందరు.. అయ్యో పాపం అంటూ.. వారి దీన స్థితిని ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆఫ్రికాలో దోమలు లేని ప్రదేశం ఉండదు. ఇక్కడ దోమలు భారీ సంఖ్యలో విహరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ బడితే అక్కడ దోమలు విహరిస్తూ ఉంటాయి. దీంతో వీటిని పట్టుకుని తినే ఆహారంగా ఉపయోగిస్తున్నారు. వాటిని గిన్నెల సహాయంతో పట్టుకుంటున్నారు. ఇలా దోమలను ముద్దను, చికెన్ బర్గర్ మాదిరి తయారు చేసి, నూనెలో బాగా వేయించి తింటున్నారట. ఇలా ఒకొక్క మస్కిటో బర్గర్‌కు దాదాపు 5 లక్షల దోమలు అవసరం అవుతుందట.ఆరోగ్య ప్రయోజనాలు: ఈ దోమల్లో పోషకాలు కూడా అధికంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. దీంతో దోమలతో తయారు చేసిన బర్గర్లను తినడం ద్వారా ఆఫ్రికన్లు ప్రోటీన్లు పొందుతున్నారు. దోమల్లో పశు మాంసం కంటే 7 రెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. ప్రభుత్వం ఎలాగో వారిని ఆదుకోలేకపోతోంది. కనీసం ప్రకృతి అయినా దోమల రూపంలో వారి ఆకలిని తీస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!