ఇకపై మెట్రో ట్రైన్‌లో ప్రయాణించడానికి ఎలాంటి కార్డ్, లేదా క్యాష్‌తో పనిలేదు. ఎందుకంటే మెట్రో ట్రెయిన్‌లో ఎలాంటి కార్డ్, క్యాష్ లేకుండా ప్రయాణించే సరికొత్త టెక్నాలజీను రష్యా ఆవిష్కరించింది. కార్డ్, క్యాష్‌కు బదులుగా ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపు జరిగే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ తరహా చెల్లింపుల వ్యవస్థను రష్యా ప్రవేశపెట్టింది. మాస్కోలో సుమారు 240 మెట్రో స్టేషన్లలో ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. మాస్కోలో వరల్డ్ లార్జెస్ట్ వీడియో సర్వెలెన్స్ సిస్టమ్ అమలులో ఉంది. ఇది కరోనా టైంలో, రాజకీయ ర్యాలీలు, క్వారెంటెన్‌కు తరలించే సమయంలో ఈ నిఘా వ్యవస్థ అక్కడి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
SBI ట్రావెల్ కార్డ్‌తో..క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా.. వీడియో
Viral Video: పెళ్లి కోసం యువ జంట సాహసం.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో