Israel Attack: ఒకే ఒక్క అటాక్‌.. భగ్గుమంటున్న పశ్చిమాసియా.! వీడియో..

Israel Attack: ఒకే ఒక్క అటాక్‌.. భగ్గుమంటున్న పశ్చిమాసియా.! వీడియో..

|

Updated on: Oct 11, 2024 | 8:18 PM

ఒకే ఒక్క అటాక్‌.. ఏడాది క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన ఒకే ఒక్క అటాక్‌తో మొదలైన యుద్ధం.. అంతకంతకూ విస్తరిస్తోందే తప్ప తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసి ఏడాది పూర్తవుతోంది. మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో హమాస్‌ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో యుద్ధం మొదలైంది. ఆ వార్‌ గాజా స్ట్రిప్‌ను దాటి లెబనాన్‌ , ఇరాన్‌ వరకు విస్తరించింది.

ఒకే ఒక్క అటాక్‌.. ఏడాది క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన ఒకే ఒక్క అటాక్‌తో మొదలైన యుద్ధం.. అంతకంతకూ విస్తరిస్తోందే తప్ప తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసి ఏడాది పూర్తవుతోంది. మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో హమాస్‌ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో యుద్ధం మొదలైంది. ఆ వార్‌ గాజా స్ట్రిప్‌ను దాటి లెబనాన్‌ , ఇరాన్‌ వరకు విస్తరించింది. హమాస్‌ జరిపిన తొలిదాడిలో సుమారు 14 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 250 మందికిపైగా సామాన్య ప్రజలను ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిపోయారు. బందీల్లో 100 మందిని చంపేశారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. గాజాపై బాంబుల మోత మోగించింది. హమాస్ నేతలే టార్గెట్‌గా ఆపరేషన్ చేపట్టింది. టెక్నాలజీని వినియోగించి పేజర్లను కూడా పేల్చేసి యుద్ధాన్ని వేరే లెవల్‌కు తీసుకెళ్లింది ఇజ్రాయెల్‌. హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. లెబనాన్‌ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇజ్రాయెల్‌పైకి మిస్సైల్స్‌, డ్రోన్‌తో ఎటాక్ చేసింది.

దీంతో ఇజ్రాయెల్‌ హెజ్‌బొల్లాపై ప్రతీకార దాడులు చేసింది. హెజ్‌బొల్లా స్థావరాలపై తొలుత వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్‌.. నాలుగైదు రోజుల క్రితం నుంచి భూతల దాడులూ చేస్తోంది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల వల్ల లెబనాన్‌లో ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దక్షిణ బీరూట్‌లో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. బీరుట్‌, గాజాల్లో గ్రౌండ్‌ ఆపరేషన్లు చేపట్టింది ఇజ్రాయెల్‌. ఇలా రెండు దేశాలతో at a time పోరాటం చేస్తోంది. మల్టిపుల్‌ ఫ్రంట్స్‌లో దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్‌.. హెజ్‌బొల్లా టార్గెట్‌గా pin pointed దాడిపై ఫోకస్‌ పెట్టింది. బీరుట్‌లో నిరంతరం విమానాలు డ్రోన్‌లు తిరుగుతూ చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తున్నాయి. చీకటి పడితే చాలు వైమానిక దాడులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. దీంతో బీరుట్ లో పరిస్థితి దారుణంగా ఉంది. దీనిపై మా భారత్ వర్ష్ కరెస్పాండెంట్‌ బీరుట్‌ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us