Viral Video: బంగారాన్ని ఇలాకూడా వాడతారా..షాకవుతున్న జనం.. వీడియో

Viral Video: బంగారాన్ని ఇలాకూడా వాడతారా..షాకవుతున్న జనం.. వీడియో

Phani CH

|

Updated on: Sep 15, 2021 | 10:45 PM

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని ఏం చేసైనా సరే ఫేమస్ అయిపోవాలుకుంటున్నారు. అలా సరికొత్తగా ట్రై చేసి రాత్రికి రాత్రే స్టార్స్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక నెట్టింట్లో లైక్స్ కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని ఏం చేసైనా సరే ఫేమస్ అయిపోవాలుకుంటున్నారు. అలా సరికొత్తగా ట్రై చేసి రాత్రికి రాత్రే స్టార్స్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక నెట్టింట్లో లైక్స్ కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇటీవల డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు యువత. ఇందుకు సంబంధించి వీడియోలు ఇంటర్నెట్‏లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సోషల్ మీడియా మత్తులో పడి కొందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. పిచ్చి మరీ ఇంతగా ఉంటుందా ? అనే సందేహాలు వస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ర్యాపర్స్ ఉన్నారు. వారు తమ మ్యూజిక్‏తో మాత్రమే కాకుండా.. జుట్టుకు రంగులు, విచిత్ర వేషధారణలతోనూ పాపులర్ అవుతుంటారు. కానీ 23ఏళ్ల ర్యాపర్ ఏకంగా బంగారు గొలుసులను జుట్టుగా పెట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఎడమవైపు తిరిగి పడుకుంటే ఇన్ని లాభాలా..?? ఆహారంతోనే కాదు పడుకునే విధానంతోనూ ఆరోగ్యం.. వీడియో

పక్షులకే చేతులొస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఊహలకు దృశ్య రూపం ఈ వీడియో