Nigeria: మధ్య నైజీరియాలో సాయుధ మూకల నరమేధం.. 160 మందికి పైగా మృతి.
మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు రెచ్చిపోయాయి. కొన్ని గ్రామాలను లక్ష్యంగా చేసుకొని వరుస కాల్పులతో నరమేదం సృష్టించాయి. ఈ కాల్పుల్లో 160 మంది మృతి చెందారు. స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేసినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి.
మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు రెచ్చిపోయాయి. కొన్ని గ్రామాలను లక్ష్యంగా చేసుకొని వరుస కాల్పులతో నరమేదం సృష్టించాయి. ఈ కాల్పుల్లో 160 మంది మృతి చెందారు. స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేసినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాడుల్లో గాయపడిన దాదాపు 300 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. బండిట్స్‌గా పిలిచే సైనిక గుంపులు.. కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా మధ్య నైజీరియా కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతోంది. సామాజిక పరమైన, మతపరమైన విబేధాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.