Red Sea: ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్‌ కేబుల్స్‌ కత్తిరిస్తాం.! షాకైన ఇంటర్నెట్ ప్రపంచం.!

Red Sea: ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్‌ కేబుల్స్‌ కత్తిరిస్తాం.! షాకైన ఇంటర్నెట్ ప్రపంచం.!

Anil kumar poka

|

Updated on: Dec 30, 2023 | 4:55 PM

హమాస్‌కు మద్దతుగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల దృష్టి సముద్ర గర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్‌ కేబుల్స్‌పై పడింది. ఇజ్రాయెల్‌, అమెరికా.. వాటి అనుకూల దేశాల్ని దెబ్బతీసే విధంగా ఎర్రసముద్రంలో ఇంటర్నెట్‌ కేబుల్స్‌ను కత్తిరించి వేస్తామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఇందుకోసం బాబ్‌ అల్‌-మందాబ్‌ జలసంధి మీదుగా సముద్రగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్‌ కేబుళ్లను కత్తిరించి వేస్తామని బెదిరింపులకు దిగారు..

హమాస్‌కు మద్దతుగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల దృష్టి సముద్ర గర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్‌ కేబుల్స్‌పై పడింది. ఇజ్రాయెల్‌, అమెరికా.. వాటి అనుకూల దేశాల్ని దెబ్బతీసే విధంగా ఎర్రసముద్రంలో ఇంటర్నెట్‌ కేబుల్స్‌ను కత్తిరించి వేస్తామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఇందుకోసం బాబ్‌ అల్‌-మందాబ్‌ జలసంధి మీదుగా సముద్రగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్‌ కేబుళ్లను కత్తిరించి వేస్తామని బెదిరింపులకు దిగారు. అదే గనుక జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయంటూ సోషల్‌మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

యెమెన్‌లోని తిరుగుబాటు దళాలు ‘హౌతీ’ల ప్రాబల్యం యెమెన్‌ ఉత్తరభాగంలో ఎక్కువ. వీళ్లకి ఇరాన్‌ నుంచి ఆర్థికంగా, సైనికపరంగా మద్దతు అందుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలను టార్గెట్‌ చేశామని ఇప్పటికే ప్రకటించారు. ఇతర డ్రోన్లు, క్షిపణులతో నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో ఎర్రసముద్రంలో నౌకా వాణిజ్యం ప్రమాదంలో పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.