Largest Volcano World: బద్ధలైన ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతం.. భారీ ఎగిసిపడుతున్న లావా..!
ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతమైన మౌనా లోవా బద్ధలైంది. అధికారుల హెచ్చరించిన ఒక నెల తర్వాత అగ్నిపర్వతం పేలింది. హవాయు దీవుల్లో ఉన్న ఈ అగ్నిపర్వతం లోంచి ఎరుపు రంగులో లావా బయటకు ఎగసిపడుతోంది..
ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతమైన మౌనా లోవా బద్ధలైంది. అధికారుల హెచ్చరించిన ఒక నెల తర్వాత అగ్నిపర్వతం పేలింది. హవాయు దీవుల్లో ఉన్న ఈ అగ్నిపర్వతం లోంచి ఎరుపు రంగులో లావా బయటకు ఎగసిపడుతోంది.. అది క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. దాంతో, ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మౌనా లోవా ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతాల్లోకెల్లా పెద్దది. ఈ అగ్నిపర్వతం ఫసిఫిక్ మహాసముద్ర మట్టానికి 13వేల 796 అడుగుల ఎత్తులో ఉంది. హవాయి దీవిలో ఉన్న ఐదు అగ్నిపర్వతాల్లో మవోనా లోవా ఒకటి. ఇది చివరిసారిగా 1984లో బద్దలైంది. ప్రస్తుతం అగ్నిపర్వతం ఉన్న భాగం వరకే లావా ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి అగ్నిపర్వతం దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు ఏ ప్రమాదంలేదని అమెరికా జియోలాజికల్ వోలక్రనిక్ యాక్టివిటీ సర్వీసెస్ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా తీవ్రత దాని పరిణామాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే చేయనున్నారు. అటు, శాస్త్రవేత్తలు కూడా అప్రమత్తం అయ్యారు. ఇటీవల భూకంపాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మవోనా లోవా నుంచి వస్తున్న సంకేతాలను తేలిగ్గా తీసుకోరాదంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..