శతాయువు కోసం జపనీయుల పంచతంత్రం

Updated on: Oct 14, 2025 | 5:05 PM

ప్రపంచంలోనే శతాధిక వృద్ధులు అధికంగా ఉన్న దేశాల్లో జపాన్‌ ప్రథమ స్థానంలో ఉంటుంది. అయితే.. తమ దీర్ఘాయుష్షుకు ఐదు కారణాలున్నాయంటున్నారు జపనీయులు.నిండైన జీవితానికి జపాన్‌ పాటించే అయిదు కీలక సూత్రాలను అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం, శరీరానికి చెమట పట్టించటం, సామాజిక అనుబంధాలు, అర్థవంతంగా జీవించడం, కొన్ని సమస్యలను గుర్తించి ముందే చెక్ పెట్టటం వంటి 5 రూల్స్ పాటించగలిగితే.. ఎవరికైనా దీర్ఘాయువు సాధ్యమేనని ఆ నిపుణులు చెబుతున్నారు.

వారి ఆరోగ్య రహస్యాల్లో మొదటిది వారి ఆహారం. అందులో చేపలు, కూరగాయలు, పులియబెట్టిన ఆహారం ముఖ్యంగా ఉంటుంది. ఇక.. వారి రోజువారీ సంప్రదాయ వంటకాల్లో సోయాబీన్ ఏదో ఒక రూపంలో ఉండాల్సిందే. కొవ్వుల శాతం అత్యల్పంగా ఉండే సోయాబీన్ వినియోగం వల్ల.. అక్కడి ప్రజల్లో ఊబకాయం అరుదు. ఇక.. రెండవ ఆరోగ్య నియమం.. వ్యాయామం. అలాగని జిమ్‌కి వెళ్లడం లేదా కష్టమైన వర్కవుట్లేమీ ఉండవు. సింపుల్‌గా ఉన్నచోట కూర్చుని లేదా నిలబడి.. శరీరాన్ని నిరంతరం కదిలిస్తూ ఉంచుతుంటారు. రోజూ కాసేపు నడవటం, చిన్నచిన్న దూరాలు నడిచి వెళ్లి పనులు చక్కబెట్టుకోవటం, ఇంట్లో పనులన్నీ స్వయంగా చేసుకోవటం చేస్తారు. వీటివల్ల శరీరం, మెదడు అనుసంధానమై పనిచేస్తూ ఉంటాయి. జపనీయుల శతాయువు మూడో రహస్యం.. మోయి. అంటే మన భాషలో సమాజంతో మమేకం కావటం. ఒకినావా అనే ప్రాంతంలో ప్రజలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి.. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకుంటూ జీవిస్తుంటారు. వీరుండే ప్రదేశాలను.. బ్లూ జోన్లుగా పిలుస్తారు. ఇక్కడ ఉండే వారు మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటివి లేకుండా హాయిగా జీవిస్తున్నారట. ఇక.. జననీయుల వయోధికులు పాటించే నాలుగో సూత్రం.. ఇకిగాయ్‌. అంటే నచ్చినట్లుగా జీవించటం. కుటుంబ, సామాజిక ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా బతుకుతూ.. మనకున్న దానిలో ఇతరులకు సాయం చేస్తూ జీవించటం అన్నమాట. ఈ బుల్లి దేశంలోని ప్రజలు.. చికిత్స కంటే నివారణే మేలు అనే రూల్ ను పాటిస్తారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ.. తమ ఆరోగ్యం మీద కన్నేసి ఉంటారు. ఏ సమస్య వచ్చినా.. దానిని తొలిదశలోనే గుర్తించి.. వెంటనే చికిత్స తీసుకుంటారు. వీరి ఈ విధానం, వీరి సామాన్య జీవనశైలి వల్ల అనేక జీవనశైలి రోగాలు వీరిని దరిచేరటం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

UPI payments: ఇక.. ఫేస్‌, ఫింగర్‌ప్రింట్‌తోనే UPI చెల్లింపులు

పాముల భయంతో.. కార్తికేయను మిస్‌ చేసుకున్న స్టార్ హీరో..

చీమలు తయారుచేసిన యోగర్ట్‌ ను చూశారా

ఈ 4 తప్పులే ఆయుష్షును తగ్గించేస్తున్నాయా ?? మరి, జపనీయుల ఆరోగ్య రహస్యం ఏమిటి?

కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే