జపాన్‌లో లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో
జపాన్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ దేశంలో వంద ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య లక్ష దాటినట్లు ప్రభుత్వం తెలిపింది. వరుసగా 55వ సంవత్సరం ఆ దేశం కొత్త రికార్డును నమోదు చేసింది. సెప్టెంబర్‌లో శతాధిక వృద్ధుల సంఖ్య 99,763కి చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి తాజాగా ప్రకటించారు. అయితే వీరిలో 88 శాతం మంది మహిళలే ఉండడం గమనార్హం.
అత్యధిక కాలం జీవిస్తున్న వారి సంఖ్య జపాన్‌లో అధికం. ఆ లిస్టులో జపాన్ టాప్‌లో ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తి ఆ దేశంలో జీవిస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కానీ అక్కడ జనన రేటు తక్కువగా ఉంది. ఆ దేశంలో జీవిస్తున్న అత్యంత వృద్ధ వ్యక్తి వయసు 114 ఏళ్లు. ఆ మహిళను షిగెకో కగావా గుర్తించారు. అత్యంత వృద్ధ మగ వ్యక్తిని కియోటకా మిజునోగా గుర్తించారు. ఆయన వయసు 111 ఏళ్లు. ఇవాటా అతని స్వస్థలం. ఆరోగ్యశాఖ మంత్రి తకమారో పుకోకా ఈ సందర్భంగా వృద్ధులకు కంగ్రాట్స్ చెప్పారు. జపాన్‌లో సెప్టెంబర్ 15వ తేదీన వృద్ధ దినోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా ప్రధాని నుంచి ఆ వృద్ధులకు ఓ లేఖ, సిల్వర్ కప్ అందిస్తారు. ఈ ఏడాది 52 వేల మంది పురస్కారానికి ఎంపికయ్యారు. 1963లో శతాధిక వృద్ధులను లెక్కించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో 153 మంది మాత్రమే వందేళ్లు దాటిన వాళ్లు ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
