గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతం.. దిక్కుతోచని స్థితిలో పౌరులు

|

Dec 09, 2023 | 9:50 AM

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరు పక్షాలనుంచి కొందరు బందీలను విడుదల అనంతరం మళ్లీ దాడులు ఉధృతం చేసింది ఇజ్రాయెల్‌ సైన్యం. గాజాస్ట్రిప్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం ప్రతి ఇంటినీ జల్లెడ పడుతోంది. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్, ఉత్తర గాజాలోని జబాలియా, షుజాయియా నగరాలను ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు చుట్టుముడుతున్నాయి.

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరు పక్షాలనుంచి కొందరు బందీలను విడుదల అనంతరం మళ్లీ దాడులు ఉధృతం చేసింది ఇజ్రాయెల్‌ సైన్యం. గాజాస్ట్రిప్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం ప్రతి ఇంటినీ జల్లెడ పడుతోంది. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్, ఉత్తర గాజాలోని జబాలియా, షుజాయియా నగరాలను ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు చుట్టుముడుతున్నాయి. ఈ మూడు నగరాల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు చిక్కుకుపోయారు. దక్షిణ గాజాలో 6 లక్షల మందికి పైగా ఉన్నారని, వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గాజాలోని శరణార్థి శిబిరాలన్నీ ఇప్పటికే బాధితులతో నిండిపోయాయని, ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AMకి PMకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు ??

TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి

Amardeep: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కీర్తి ఆవేదన

Mangalavaram: OTTలోకి మంగళవారం డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే ??

Mrunal Thakur: ఎట్టకేలకు పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..