ఇజ్రాయెల్‌పై కిల్లర్ డ్రోన్లతో తొలిసారి విరుచుకుపడ్డ ఇరాన్
ఇజ్రాయెల్‌పై ప్రతికారం తప్పదని హెచ్చరిస్తున్న ఇరాన్ శనివారం ప్రతీకార దాడులకు దిగింది. సిరియాలో ఇరాన్ దౌత్యకార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. 200 డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెలీ స్థావరాలపై దాడులకు దిగింది ఇరాన్. ఇక ఇరాన్ వైపున్న వర్గాలు ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి. స్వీయరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్‌పై ప్రతికారం తప్పదని హెచ్చరిస్తున్న ఇరాన్ శనివారం ప్రతీకార దాడులకు దిగింది. సిరియాలో ఇరాన్ దౌత్యకార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. 200 డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెలీ స్థావరాలపై దాడులకు దిగింది ఇరాన్. ఇక ఇరాన్ వైపున్న వర్గాలు ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి. స్వీయరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టు తాము భావిస్తున్నామని తెలిపింది. ఇరాన్.. మొత్తం 200 కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లను తమపై ప్రయోగించిందని ఇజ్రాయెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే డ్రోన్లు, మిసైళ్లను చాలా వరకు మార్గమధ్యంలోనే కూల్చేశామని తెలిపారు. అన్ని వైపులా సైనికులను మోహరించామని, ఇజ్రాయెల్ రక్షణ కోసం సర్వసన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి కావాలన్న కొడుకు కోరికను తీర్చిన 69 ఏళ్ల తల్లి !! ఏం చేసిందంటే ??
Datura Benefits: ఇదేదో పిచ్చి మొక్క అనుకునేరు.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ??
భార్యను కిరాతకంగా చంపి పారిపోయిన భర్త.. ఆచూకీ తెలిపిన వారికి రెండున్నర కోట్ల రివార్డు
బస్సు కింద నలిగిపోతున్నా ఎవరూ చలించలేదు..తమ్ముడి కోసం అక్క ఆవేదన