స్విస్‌ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల నగదు నిల్వలు

|

Jun 24, 2024 | 7:35 PM

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుతున్నాయి. 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్విస్‌ బ్యాంక్‌ తెలిపింది. 2022 చివరి నాటికి 46వ స్థానంలో ఉన్న భారత్‌, ఇప్పుడు 67వ స్థానంలో నిలిచింది. అయితే ఈ నిధులన్నీ బ్లాక్‌ మనీగా చెప్పలేమని స్విస్‌ అధికారులు వెల్లడించారు. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం తగ్గి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటా వెల్లడించింది.

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుతున్నాయి. 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్విస్‌ బ్యాంక్‌ తెలిపింది. 2022 చివరి నాటికి 46వ స్థానంలో ఉన్న భారత్‌, ఇప్పుడు 67వ స్థానంలో నిలిచింది. అయితే ఈ నిధులన్నీ బ్లాక్‌ మనీగా చెప్పలేమని స్విస్‌ అధికారులు వెల్లడించారు. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం తగ్గి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటా వెల్లడించింది. 2023లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 1.04 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లకు అంటే, భారత కరెన్సీలో రూ.9,771 కోట్లకు పడిపోయాయని గణాంకాలు వెల్లడించాయి. 2021లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిల్వలు 14 ఏళ్ల గరిష్ఠానికి 3.83 బిలియన్లకు చేరాయి. అయితే ఆ తర్వాత స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిల్వల క్షీణత మొదలైనట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటా వెల్లడించింది. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డేటా, వ్యక్తులు, వివిధ బ్యాంకుల్లో నిల్వలు, సంస్థల డిపాజిట్లు సహా స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల అన్ని రకాల నిధులను పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని భారతీయుల ఆస్తులను ‘బ్లాక్‌ మనీ’గా నిర్వచించలేమని స్విస్‌ అధికారులు తెలిపారు. ట్యాక్స్‌ మోసం, పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి తాము కూడా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌ టికెట్‌పై GNWL30/WL8 అంటే అర్థం ఏంటి ??

రక్తాన్ని సహజ పద్ధతుల్లో శుద్ధి చేసే ఆహారాలు..

పరీక్షల్లో స్టూడెంట్‌ రాసిన జవాబుకు టీచర్‌ షాక్‌

ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. ప్రయోజనాలు తెలిస్తే

తిన్న తిండి అరగడంలేదా.. ఇలా చేయండి

Follow us on