Indian kidnapped in Kabul video: కాబూల్‌లో ఇండియన్‌ వ్యాపారి కిడ్నాప్‌.. నడిరోడ్డుపై తుపాకులతో బెదిరించి…(వీడియో)

|

Sep 20, 2021 | 9:25 AM

అఫ్గానిస్థాన్‌లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఏర్పాటైంది. తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచ‌కాలు మొద‌ల‌య్యాయి. న‌డిరోడ్డుపైనే ప్రజలను బెదిరించి కిడ్నాపులకు పాల్పడుతున్నారు. అఫ్గానిస్థాన్‌ రాజ‌ధాని కాబూల్‌లో వ్యాపారం చేస్తున్న భారతదేశానికి చెందిన బ‌న్స‌రీలాల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఏర్పాటైంది. తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచ‌కాలు మొద‌ల‌య్యాయి. న‌డిరోడ్డుపైనే ప్రజలను బెదిరించి కిడ్నాపులకు పాల్పడుతున్నారు. అఫ్గానిస్థాన్‌ రాజ‌ధాని కాబూల్‌లో వ్యాపారం చేస్తున్న భారతదేశానికి చెందిన బ‌న్స‌రీలాల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. 50ఏళ్ల బ‌న్స‌రీలాల్ కాబూల్‌లో ఫార్మా వ్యాపారం చేస్తున్నారు. ఉద‌యం ఇంటినుంచి కారులో బయలుదేరిన బన్సరీలాల్‌ను దుండగులు ఢీకొట్టారు. అనంత‌రం తుపాకులతో బెదిరించి, ఆయ‌న సిబ్బందితో సహా బన్సరీలాల్‌ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు.

అయితే, ఈ కిడ్నాప్‌నుంచి బన్సరీలాల్‌ సిబ్బంది ఎలాగో త‌ప్పించుకొని బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయనమాత్రం కిడ్నాప‌ర్ల చెర‌లోనే ఉన్నారు. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాప్ వ్యవ‌హారంపై భార‌త విదేశాంగ శాఖ‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫోర‌మ్ అధ్య‌క్షుడు పునీత్ చందోక్ తెలిపారు. ఈ కిడ్నాప్ వెనుక తాలిబ‌న్లు ఉన్నారా తేదంటే ఎంకెవ‌రైనా ఉన్నారా అనే విష‌యం తెలియాల్సి ఉన్న‌ది. లాల్‌ కుటుంబం హరియాణాలోని ఫరీదాబాద్‌ పట్టణంలో నివాసముంటోంది. కాబూల్‌లో లాల్‌ గత రెండు దశాబ్దాలుగా బన్సారీలాల్‌ వ్యాపారం చేస్తున్నారు.
YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Warangal Kakatiya Medical College: ర్యాగింగ్ కలకలం.. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తో బట్టలిప్పించి..!(వీడియో)

 Sarkaru Vaari Paata Movie: బుల్లెట్ బండిపై మహేష్ బాబు.. సర్కారు వారి పాట నుంచి మరో లీక్‌ ..?(వీడియో)

 Megastar Chiranjeevi: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో అమీర్ ఖాన్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు(వీడియో)

 Srisailam Dam: శ్రీశైలానికి జలకళ.. నిండుకుండల్లా తెలుగు ప్రాజెక్టులు.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు(వీడియో)